
నటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తాజాగా తన కుల సర్టిఫికెట్ ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పుపై నవనీత్ కౌర్ స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీకోర్టును ఆశ్రయిస్తామని ఆమె చెప్పారు. నేను ఈ దేశ పౌరురాలిగా బాంబే హైకోర్టు ఆదేశాన్ని గౌరవిస్తాను. నేనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది అని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ లోక్ సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ విజయం సాధించారు.