https://oktelugu.com/

Social media activist Varra Ravinder Reddy : రాష్ట్రాలు దాటాడా? దేశం దాటి వెళ్లిపోయాడా? రవీందర్ రెడ్డి కోసం పోలీసుల జల్లెడ!*

దిగువ స్థాయి పోలీస్ అధికారులు చేసిన తప్పిదం.. ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటోంది. కడప ఎస్పీ పై బదిలీకి అదే కారణం. వైసిపి సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీస్ శాఖ వైఫల్యం బయటపడింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 8, 2024 / 04:30 PM IST

    Social media activist Varra Ravinder Reddy

    Follow us on

    Social media activist Varra Ravinder Reddy :  వైసిపి హార్డ్ కోర్ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో రవీందర్ రెడ్డి ముందుండే వారు. ఈ క్రమంలో ప్రత్యర్థుల ఇళ్లలో మహిళలపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండు రోజుల కిందట కడప పోలీసులకు రవీందర్ రెడ్డి చిక్కారు. అయితే ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి పోలీస్ అధికారులు చేతులు దులుపుకున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిఆదేశాలతోనే ఈ విధంగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మరో కేసులో రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధపడిన పోలీసులకు ఆయన కనిపించలేదు. కొందరు పోలీసులే చేజేతులా రవీందర్ రెడ్డిని విడిచి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కర్నూలు రేంజ్ డీఐజీ విచారణ చేపట్టారు. కడప ఎస్పి పై బదిలీ వేటు పడింది. పోలీస్ శాఖ సీరియస్ గా యాక్షన్ లోకి దిగింది. రవీందర్ రెడ్డి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అనంతపురం తో పాటు కడప జిల్లాలో రెండు టీంలు వెతుకుతున్నాయి. మరో టీం బెంగుళూరు వెళ్ళింది. నాలుగో టీం వర్ర రవీందర్ రెడ్డి కాల్ డేటా సేకరించి పనిలో పడింది. మరోవైపు కడప పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    * మారు వేషంలో తప్పించుకున్నాడట
    ఈనెల ఐదున రాజంపేట పోలీసులు వర్రా రవీందర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.అదే రోజు సీఎం చంద్రబాబు కుటుంబం పై నీచమైన పోస్టులు పెట్టాడు రవీందర్ రెడ్డి.దీనిపై కడపలో మరో కేసు నమోదు అయింది. కడప ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకొచ్చారు. అదే సమయంలో రాజంపేట నుంచి మరో టీం కడపకు వచ్చింది. ఈ లోగా మారువేషంలో రవీందర్ రెడ్డి తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కడప ఎంపీ ఆదేశాల మేరకు కొందరు పోలీసు అధికారులు రవీందర్ రెడ్డిని వదిలేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలో ఒక సీఐతో పాటు మరో ఎస్ఐ పాత్ర పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    * దొరికితే వైసిపి పెద్ద నేతల చుట్టూ ఉచ్చు
    వర్రా రవీందర్ రెడ్డి వైసీపీ కీలక నేత కుటుంబ సహాయకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సమయంలో సైతం ఈ పేరు తెరపైకి వచ్చింది. రవీందర్ రెడ్డి పట్టుబడితే వైసీపీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. అందుకే పాత పరిచయాలను ఉపయోగించుకొని కొందరు పోలీసు అధికారులతో రవీందర్ రెడ్డిని తప్పించారని ప్రచారం సాగుతోంది. రవీందర్ రెడ్డి సేఫ్ జోన్లోకి వెళ్లారని.. దేశంలోనే మారుమూల ప్రాంతంలో దాక్కున్నారని.. విదేశాలకు వెళ్లిపోయారని.. ఇలా రకరకాలుగా ప్రచారం నడుస్తోంది. కానీ పోలీస్ బృందాలు మాత్రం ఆయన కోసం వెంటాడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.