
దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో తీవ్ర ప్రభావం చూపింది. భారత్ లో కరోనా విజృంభించేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు. పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ లో కరోనా వైరస్ బీ1.1.28.2 కొత్త వేరియంట్ ను శాత్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్, యూకే నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను జన్యుక్రమాలను విశ్లేషించగా బీ 1.128.2 వేరియంట్ వెలుగులోకి వచ్చింది.