
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 1 నుంచి కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి 28 శాతానికి ఇటీవల పెంచిన కేంద్రం మరో బొనంజా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెండ్ అలవెన్స్ కూడా పెంచింది. రివైజ్ చేసిన హెచ్ ఆర్ ఏను ఆగస్టు నుంచి ఉద్యోగులు అందుకోనున్నారు. డీఏ 25 శాతం దాటినందున హెచ్ఆర్ఏ పెంచినట్లు కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు నివసిస్తున్న సిటీలను బట్టి వివిధ కేటగిరిలుగా హెచ్ఆర్ఏను అందుకుంటారు.