
ఆంధ్రప్రదేశ్ కు మరో 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను గురువారం కేంద్రం పంపింది. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి మధ్యాహ్నం గన్నవరం విమాశ్రయానికి వ్యాక్సిన్ డోసులు చేరాయి. ఆరోగ్య శాఖ అధికారులు వీటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఆయా జిల్లాలకు అవసరాలకు అనుగుణంగా వీటిని సరఫరా చేయనున్నారు. టీకాలు అందడంతో పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.