Mana Shankara Varaprasad Garu : రాజమౌళి తర్వాత మన టాలీవుడ్ లో ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనిల్ రావిపూడి(Anil ravipudi) మాత్రమే. ఇండస్ట్రీ లో ఇతను గొప్ప డైరెక్టర్ కాదు, కానీ సక్సెస్ ఫార్ములా తెలిసిన డైరెక్టర్. గొప్ప డైలాగ్స్ రాసే డైరెక్టర్ కూడా కాదు, కానీ ప్రేక్షకుల పల్స్ ని పట్టి, వాళ్ళు ఎక్కడైతే నవ్వుతారో అక్కడ నవ్వు రప్పించగల ప్రతిభ ఉన్న డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, పటాస్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసి, నేడు ప్రతీ హీరో చేస్తే అనిల్ రావిపూడి తో సినిమా చెయ్యాలి అనిపించే స్థాయికి ఎదిగాడు. ఇక నేడు ఆయన దర్శకత్వం వహించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూలు కడుతున్నారు. మెగాస్టార్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ వస్తే ఎలాంటి వసూళ్లు వస్తాయో, నేటి తరం ఆడియన్స్ కి మరోసారి అర్థం అయ్యేలా చేసాడు అనిల్ రావిపూడి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం తర్వాత అనిల్ ఏ హీరో తో పని చేయబోతున్నాడు?, ఎలాంటి సినిమా తియ్యబోతున్నాడు అనే దానిపై అనిల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆయన తదుపరి చిత్రం మాత్రం దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. హీరో మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). దిల్ రాజు రేండు నెలల క్రితం అనిల్ రావిపూడి తో కలిసి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ కి లెక్చరర్ రోల్ లో ఉండే కథ ని వివరించాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.
కేవలం 70 రోజుల్లోనే సినిమాని పూర్తి చేస్తానని మాట కూడా ఇచ్చాడట అనిల్. పవన్ కళ్యాణ్ కూడా అనిల్ చెప్పిన లైన్ ని చాలా మెచ్చుకున్నాడని, అన్నయ్య సినిమా విడుదలైన తర్వాత, కొంత గ్యాప్ తీసుకొని, పూర్తి స్థాయి స్క్రిప్ట్ తో నా వద్దకు రా అని అనిల్ కి పవన్ చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుందో, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు కానీ, విడుదల అయ్యేది మాత్రం సంక్రాంతికి మాత్రమే అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. కానీ సంక్రాంతికి విడుదలైన ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అవ్వలేదు. అందుకే ఈసారి సంక్రాంతికి ఎలా అయినా ఒక మంచి బ్లాక్ బస్టర్ ని కొట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనుంది.