
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె నానమ్మ వయోభారం కారణంగా కన్నుమూసారు. అనన్య తండ్రి చుంకీ పాండే అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. అంత్యక్రియలకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అనన్య పాండే ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.