
కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోస్తుతో ఆయన్ను తరలించారు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్టపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈనెల 21నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై ఉత్యంఠ కొనసాగుతోంది. కృష్టపట్నంలో ఇప్పటికే విధించిన 144 సెక్షన్ ను కొనసాగిస్తున్నారు. ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయన్ను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్లు సమాచారం.