Amit Shah On English Language: ఇంగ్లీష్ లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని అమిత్ షా అన్నారు. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని ఆయన అన్నారు. అవి మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండేలేమని వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఈ విధంగా మాట్లాడారు. ఈ దేశంలో ఇంగ్లీష్ లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అటువంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు.