
భారత స్టార్ బాక్సర్, ప్రపంచ నంబర్ వన్ అమిత్ పంఘాల్ 52 కేజీల విభాగం ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమిపాలయ్యాడు. దాంతో ఒలింపిక్స్ లో భారత్ కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేతగా నిలిచిన యుబెర్జన్ మార్టినెజ్ చేతిలో అమిత్ 1-4 తేడాతో విఫలమయ్యాడు. తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న అమిత్ పై భారీ అంచనాలు ఉండగా తొలి రౌండ్ లోనే పర్వాలేదనిపించాడు. తర్వాత పూర్తిగా తేలిపోయాడు.