https://oktelugu.com/

ప్రధానికి అమెరికా బహుమతి.. 157 పురాతన వస్తువులు తిరిగి తీసుకొస్తున్న మోదీ

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ సమావేశం ఇరుదేశాల మైత్రిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. భారత్ ను ప్రధాన మిత్రదేశంగా భావిస్తున్నామని బైడెన్ పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పడే పరిణితి చూపించిన బైడెన్ అధ్యక్షుడయ్యాక ఇరుదేశాల సంబంధాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లారని ప్రశంసలు కురిపించారు మోదీ. అయితే మోదీ అమెరికా పర్యటనలో భాగంగా పురాతన […]

Written By: , Updated On : September 26, 2021 / 12:32 PM IST
Follow us on

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ సమావేశం ఇరుదేశాల మైత్రిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. భారత్ ను ప్రధాన మిత్రదేశంగా భావిస్తున్నామని బైడెన్ పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పడే పరిణితి చూపించిన బైడెన్ అధ్యక్షుడయ్యాక ఇరుదేశాల సంబంధాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లారని ప్రశంసలు కురిపించారు మోదీ.

అయితే మోదీ అమెరికా పర్యటనలో భాగంగా పురాతన కళాఖండాలు, వస్తువులను అమెరికా సాంస్కృతిక శాఖ భారత్ కు అప్పగించింది. మోదీ అమెరికా నుంచి 157 వస్తువులను భారత్ కు తీసుకొస్తున్నారు. 11నుంచి 14వ శతాబ్దానికి చెందిన కళాఖండాలను మోదీ స్వదేశానికి తెస్తున్నారు. అయితే ఈ కళాఖండల్లో క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు, 12 వ శతాబ్దానికి చెందిన రాగి నటరాజ విగ్రహం ఉన్నాయి.

అమెరికా అప్పగించిన కళాఖండాల్లో 45 విగ్రహాలు క్రీస్తు పూర్వానికి చెందినవిగా గుర్తించారు. సంగం కళాఖండాలు సంస్కృతికి సంబంధించినవి కాగా మిగిలినవి హిందూ, బౌద్ధం, జైన మతాలకు చెందిన ఆకృతులు ఉన్నాయి. అమెరికా పురాతన విగ్రహాలను భాతర్ కు అందించడాన్ని మోదీ స్వాగతించారు. అక్రమ మార్గాల్లో సాంస్కృతిక వస్తువులను తరలించకుండా చర్యలు బలోపేతం చేయాలని మోదీ, బైడెన్ నిర్ణయించారు. భారత్ కు చెందిన పురాతన వస్తువులను కఖాఖండాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.