Amaravati Women: విజయవాడ ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనలు చేశారు. కార్యాలయం బోర్డును తొలగించారు. ఈ క్రమంలో సాక్షి యాజమాన్యం కార్యాలయం గేటుకు తాళాలు వేసింది. దీంతో మహిళా నేతలు గేటు ఎక్కి నిరసన తెలిపారు. మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల జగన్ భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని వాసులు, మహిళలు సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు.