Allu Arjun craze : గంగోత్రి సినిమాతో తన కెరియర్ ని మొదలుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో యూత్ ఐకాన్ గా మమారిపోయాడు. అలాంటి నటుడు మరొకరు ఉండరనేంతలా మార్కును చూపించిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఎక్కడ మొదలైన ఆయన ప్రస్థానం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అల్లు అర్జున్ కి చాలా బాగా అవుతుంది. తెలుగులో అతను హీరోగానే పనికిరాడు. ఆ లుక్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేవని విమర్శించిన వాళ్ళు సైతం ఇప్పుడు అతన్ని ఐకానిక్ స్టార్ అంటూ అభివర్ణిస్తుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడైతే విమర్శించబడ్డాడో అక్కడే తన స్టార్ డమ్ ను విస్తరించకున్నాడు.
టాప్ లెవల్ కి వెళ్ళాడు. ఇక ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు. అట్లీ డైరెక్షన్లో చేస్తున్న ‘రాకా’ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు… ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇక బాలీవుడ్ హీరోలు సైతం అతని క్రేజ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు.
రీసెంట్ గా అల్లు అర్జున్ రాకా సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని చూడడానికి అభిమానులంతా ఎగబడ్డారు. మొత్తానికైతే ఆయన క్రేజ్ ప్రస్తుతం తారా స్థాయిలో ఉందనే చెప్పాలి. ఆయన క్రేజ్ చూసి బాలీవుడ్ హీరోలు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ ఏంటి ఆయన స్టైల్ ఏంటి అంటూ చాలా మంది బాలీవుడ్ హీరోలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ స్టార్ డామ్ చూసిన సినిమా మేధావులు సైతం ఆయన మరో రెండు సక్సెస్ లను సాధిస్తే మాత్రం ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు…చూడాలి మరి అల్లు అర్జున్ ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాడు. మరోసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేయగలుగుతాడా లేదా అనేది…
