
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో భారత్ లో తాత్కాలిక ఆశ్రయం పొందాలనుకుంటున్న శరణార్థులు ఈ-వీసాలను తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గతంలో వీసాలు తీసుకుని, ప్రస్తుతం భారత్ లో లేని అఫ్గాన్ల వీసాలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. వారు కూడా ఈ-వీసాలను దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.