Homeక్రీడలుAjinkya Rahane : 1.5 కోట్ల కెప్టెన్ అని ఎగతాళి చేశారు..సీన్ కట్ చేస్తే కోల్...

Ajinkya Rahane : 1.5 కోట్ల కెప్టెన్ అని ఎగతాళి చేశారు..సీన్ కట్ చేస్తే కోల్ కతా పాలిటి సూపర్ హీరో

Ajinkya Rahane : బుమ్రా..బౌల్ట్.. హార్దిక్ పాండ్యా.. ఘజన్పర్.. శార్దూల్ ఠాకూర్..మయాంక్ మార్కండే.. మాములు బౌలర్లు కాదు.. పైగా వారి సొంత మైదానం.. బుమ్రా అయితే నిప్పులు చిమ్మే విధంగా బంతులు వేస్తాడని మనందరికీ తెలుసు. ఇంతటి అరివీర భయంకరమైన బౌలర్లను కాచుకున్నాడు. అలెన్(37), గ్రీన్(18), చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా నిలబడ్డాడు. నాయకుడిగా తన స్థాయిని చూపించాడు.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా కెప్టెన్ రహానే మెరిశాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 67 పరుగులుచేశాడు. అలెన్ తో కలిసి తొలి వికెట్ కు 69, గ్రీన్ తో కలిసి రెండో వికెట్ కు 40, రఘుువంశీతో కలిసి మూడో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశాడు. రహానే దూకుడు వల్ల కోల్ కతా జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

పటిష్టమైన ముంబై బౌలింగ్ పై రహానే ఆది నుంచి ఎదురు దాడి చేశాడు. బౌలర్ ఎవరనేది చూడలేదు. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. తన ఫామ్ మీద వస్తున్న విమర్శలకు బ్యాట్ ద్వారానే సమాధానం చెప్పాడు. ఒకానొక దశలో రహానే సెంచరీ చేస్తాడని అనుకున్నారు. కానీ, శార్దుల్ బౌలింగ్ లో పాండ్యా కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

ఐపీఎల్ ప్రారంభానికి ముందు రహానే పై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. 1.5 కోట్ల కెప్టెన్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. మీమ్స్ క్రియేట్ చేశారు. అయితే వారందరికీ రహానే తన బ్యాట్ ద్వారా సమాధానం చెప్పాడు. కోల్ కతా జట్టుకు తను ఎంత స్పెషలో నిరూపించాడు. రహానే సూపర్ బ్యాటింగ్ నేపథ్యంలో కోల్ కతా యజమాని షారూఖ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular