Air India: ఆ ప్రాంతాలకు అడిషినల్ విమానాలు.. ఎయిర్ ఇండియా ఎందుకు నడుపుతోంది?

ఎయిర్ లైన్స్ ఢిల్లీ-కోపెన్హాగన్ మార్గంలో మరొక విమాన సర్వీస్ ను ఏర్పాటు చేసింది. ఈ మార్గంలో ఫ్రీక్వెన్సీని వారానికి 5 రెట్లు పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

Written By: Neelambaram, Updated On : May 11, 2024 5:42 pm

Air India

Follow us on

Air India: ప్రయాణికుల డిమాండ్ల మేరకు ఆమ్‌స్టర్ డామ్, కోపెన్హాగన్, మిలాన్ కు అదనపు విమానాలను నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు. జూన్ 22వ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఢిల్లీ టు ఆమ్‌స్టర్ డామ్, షిపోల్ టు ఢిల్లీ నుంచి మిలన్ మల్పెన్సాకు రోజువారీ నాన్ స్టాప్ విమానాలను నడుపుతోంది. రెండు ప్రధాన మార్గాల్లో వారానికి 4 – 5 రెట్లు ఫ్రీక్వెన్సీని పెంచుతోంది.

ఎయిర్ లైన్స్ ఢిల్లీ-కోపెన్హాగన్ మార్గంలో మరొక విమాన సర్వీస్ ను ఏర్పాటు చేసింది. ఈ మార్గంలో ఫ్రీక్వెన్సీని వారానికి 5 రెట్లు పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అదనపు విమానాలను ప్రారంభించడం 16 జూన్, 2024 నుంచి జ్యూరిచ్ కు ఎయిర్ ఇండియా రోజువారీ, నాన్ స్టాప్ విమానాలను, అలాగే ఫ్రాంక్ఫర్ట్, పారిస్ చార్లెస్ డీ గాల్ (సీడీజీ)కి రోజువారీ సేవలను రన్ చేస్తుంది. ఇది భారతదేశం, ఐరోపా మధ్య ఇన్ బౌండ్, అవుట్ బౌంబ్ ప్రయాణీకుల ట్రాఫిక్, సరుకు రవాణాను మరింత పెంచుతోంది.

ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీ క్యాంప్ బెల్ విల్సన్ మాట్లాడుతూ.. ‘ఎయిర్ ఇండియా కొనసాగుతున్న పరివర్తన ప్రయాణంలో మా గ్లోబల్ రూట్ నెట్ వర్క్ విస్తరణ మాకు కీలక ప్రాధాన్యతగా ఉంది. ఐరోపాకు పెరిగిన ఫ్రీక్వెన్సీ, అలాగే భారతదేశం మరియు ఐరోపా మధ్య ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ తెలుస్తోంది. మా వినియోగదారులకు ఎక్కువ ఎంపిక, సౌలభ్యాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం.’ ఈ కొత్త విమానాలు వాణిజ్య మరియు పర్యాటక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, యూరప్ నుంచి భారత ఉపఖండం, ఆగ్నేయ ఆసియాలోని ఇతర దేశాలకు వెళ్లి వచ్చేందుకు ప్రయాణికులకు ఢిల్లీ హబ్ ద్వారా అంతరాయం లేని కనెక్టివిటీని అందిస్తాయి.’ అని ఆయన అన్నారు.

మూడు యూరోపియన్ నగరాలకు పెరిగిన ఫ్రీక్వెన్సీతో, ఎయిరిండియా ఆమ్‌స్టర్ డామ్ షిపోల్, కోపెన్హగన్, ఫ్రాంక్ఫర్ట్, మిలన్ మల్పెన్సా, పారిస్ సీడీజీ, వియన్నా మరియు జ్యూరిచ్ వంటి ఏడు పాయింట్లకు వారానికి 80 విమానాలతో ఐరోపా ప్రధాన భూభాగానికి సేవలు అందిస్తుంది. ఎయిర్ ఇండియా తన రెండు-తరగతి కాన్ఫిగర్ చేసిన బోయింగ్ 787 డ్రీమ్ లైనగర్ విమానాన్ని యూరప్ ప్రధాన భూభాగానికి వెళ్లే అన్ని విమానాల్లో ఉపయోగిస్తుంది, ఈ సర్వీస్ బిజినెస్ క్లాస్ లో 18 ఫ్లాట్ బెడ్లు, ఎకానమీలో 236 విశాలమైన సీట్లు ఉన్నాయి.