
ఆఫ్టనిస్థాన్ లోని ఒక్కో నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో సగభాగానికిపైగా తాలిబన్ల ఆధీనంలో ఉండగా, తాజాగా దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ కూడా వారి వశమైంది. ఈ మేరకు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఇక ప్రభుత్వ ఆధీనంలో కేవలం రాజధాని కాబూల్, మరో ప్రావిన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటి కే ఆష్ఘనిస్తాన్ లోని తొమ్మిది ప్రావిన్సుల రాజధానులను ఆక్రమించిన తాలిబన్లు గురువారం కొత్తగా ఘాజ్నీ, హేరట్ ప్రావిన్సులను తమ ఖాతాలో వేసుకున్నారు.