
ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్తోంది. పది రోజులుగా దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తున్న ఈ తిరుగుబాటు దారులు.. ఆదివారం రాజధాని కాబూల్ లోకి కూడా వచ్చారు. దీంతో అక్కడి ప్రభుత్వం దిగి వచ్చింది. తాలిబన్లకు శాంతియుతంగా అధికార బదిలీ చేస్తామని అక్కడి మంత్రి వెల్లడించారు. ఇప్పటికే తాలిబన్ల తరఫున మధ్యవర్తులు చర్చల కోసం అధ్యక్ష భవనానికి వెళ్లారు. దీంతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికార పీఠం నుంచి దిగిపోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.