
రాజధాని వ్యాజ్యాలపై విచారణ వాయిదా పడింది. నవంబరు 15కి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్య విచారణ వాయిదా వేయాలని పిటిషనర్లు, వాళ్ల తరఫు న్యాయవాదులు కోర్టును విజ్ఞప్తి చేశారు. దేశంలో పరిస్థితు దృష్ట్యా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదులు వాయిదా నిర్ణయాన్ని కోర్టుకే వదిలేశారు. దేశంలో, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను పరిగణనలోకి తీసుకొని సీజే ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.