
యుద్ధం గెలవకపోతే ఎంత మందిని ఓడించినా లాభం లేదని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ జట్టు ఓటమిపై స్పందిస్తూ అతడీ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ సేన రెండేళ్లుగా పడిన కష్టం సాధించిన విజయాలు ఒక్క సెషన్ తో కనుమరుగయ్యాయని అన్నాడు. భారత జట్టు గత ఐదేళ్లుగా టెస్టు ర్యాంకింగ్స్ లో వరుసగా టాప్ లో నిలుస్తూ వచ్చింది. కానీ దురదృష్టం కొద్దీ సరిగ్గా ఆడలేకపోయిన ఆ ఒక్క గంటనే చరిత్ర గుర్తుంచుకుంటుంది అని అన్నారు.