
అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్ కు భారత్ నుంచి 101 మంది సైనికులను పంపనునట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈనెల 22 నుంచి రష్యాలో అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఆర్మీ స్కౌట్ మాస్టర్స్ కాంపిటీషన్, ఎల్ర్బస్ రింగ్, పోలార్ స్టార్, స్నిపర్ ఫ్రాంటియర్, సేఫ్ రూట్ గేమ్స్ లో భారత సైన్యం పాల్గొంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. పాంటూన్ బ్రిడ్జ్ నిర్మాణం.. యూఏవీ సిబ్బంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.