
ఒక వ్యక్తి కదులుదున్న విమానం నుంచి దూకాడు. దీనికి ముందు కాక్ పిట్ లోకి ప్రవేశించేందుకు అతడు ప్రయత్నించాడు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సాల్ట్ లేక్ సిటీకి స్కైవెస్ట్ నడుపుతున్న యునైటెడ్ ఎక్స్ ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి 7 గంటల తరువాత ఒక గేట్ నుంచి కదులుతున్నది. ఇంతలో ఒక ప్రయాణికుడు ప్లైట్ నుంచి దూకాడానికి ప్రయత్నించాడు. తరువాత ఎమర్జెన్సీ డోర్ తెరిచి విమానం నుంచి కిందకు దూకాడు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు గాయపడిన అతడిని అదుపులోకి తీసుకున్నారు.