https://oktelugu.com/

Aghori Matha : బట్టల్లేకుండా హైవేపై అఘోరి హల్చల్.. త్రిశూలం తో దాడి.. పోలీసులు ఏం చేశారంటే

నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరి సంచారం సంచలనం రేపుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ మహిళా అఘోరి 20 ఏళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి.. అఘోరిగా తెలంగాణలో ప్రత్యక్షమైంది.

Written By: Raj Shekar, Updated On : November 19, 2024 1:32 pm
Aghori Matha

Aghori Matha

Follow us on

Aghori Matha :  తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి కొన్ని రోజులుగా హల్‌చల్‌ చేస్తోంది. దీపావళికి ముందు.. ఓ కారు పుర్రె బొమ్మలతో తిరుగుతూ తెలంగాణలో కనిపించింది. ఆశ్చర్యపోయిన అందరూ ఈ కారు ఎవరిది అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఓ ఆలయం వద్ద మహిళా అఘోరి కనిపించింది. ఆలయంలో పూజలు చేసి.. కారులో వెళ్లడంతో మీడియా దృష్టి ఆమెపై పడింది. యూట్యూబ్‌ చానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అప్పడప్పుడు శ్మషానాల్లో కనిపించింది. ఆలయాల్లో పూజలు చేసింది. రోజులో ప్రాంతంలో కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణలో కనిపించిన అఘోరీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కార్తిక పౌర్ణమి రోజు శ్రీశైలంలో ప్రత్యక్షమైంది. అక్కడ హడావుడి చేసింది. తాజాగా ఏపీలోని మంగళగిరిలో హల్‌చల్‌ చేసింది. 16వ నంబర్‌ జాతీయ రహదారిపై త్రిశూలం చేతబూని ప్రజలపై దాడికి యత్నించింది. దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కార్‌ వాష్‌ కోసం ఓ షెడ్డు వద్ద ఆగిన అఘోరిని చూసేందుకు భారీగా జనం వచ్చారు.

భక్తులపై దాడికి యత్నం..
అఘోరిని చూసేందుకు వచ్చినవారు సెల్‌ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహించిన అఘోరి త్రిశూలంతో దాడి చేయడానికి యత్నించింది. ఈ క్రమంలో నూలకపేటకు చెందిన యువకుడి కాలు విరిగింది. అంతటితో ఆగకుండా అఘోరని రహదారిపైకి వచ్చి… తన వెంటపడేవారిపైకి దాడి చేయాలని చూసింది. తప్పించుకునే క్రమంలో కొందరు డివైడర్‌పై పడ్డారు. పోలీసులు అతి కష్టం మీద అఘోరి చేతిలో ఉన్న త్రశూలం లాక్కున్నారు.

పోలీసులకు గాయాలు..
త్రిశూలం లాక్కున్నా అఘోరి శాంతించలేదు. పోలీసులపై కన్నెర్రజేసింది. చేతులతో దాడిచేసింది. ఈ ఘటనలో సీఐతోపాటు ఎస్సై, కొందరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంతో విజయవాడ, హైదరాబాద్‌ రహదారిపై రెండున్నర గంటపాటు హల్‌చల్‌ చేసింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చాలా సేపటి తర్వాత కొందరు ఆమెకు నచ్చజెప్పి శాంతింజేశారు. వస్త్రాని శరీరానికి కట్టారు. కారులో ఎక్కించి విజయవాడవైపు పంపించారు.