Nalgonda: కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. కేసు నమోదు చేసేదాక వెనక్కి తగ్గేది లేదంటూ మహిళా తేల్చి చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ మాత్రం దానికి కేసు ఎందుకని చెప్పినా మహిళా ససేమిరా అన్నది. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. చివరకు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పారు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి గంగమ్మను పంపించారు. ఈ కోడి పంచాయితీనీ ఎలా పరిష్కరించాలో అర్దం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
పోలీస్ స్టేషన్లో కోడి పంచాయితీ
కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టిన రాకేష్ అనే వ్యక్తి
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ
పోలీసులు సర్దిచెప్పే… pic.twitter.com/I9MssgNZbh
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025