
మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆఫ్రికా నుంచి యూరప్ చేరుకోవడం కోసం రబ్బర్ బోటులో వెళ్తున్న 130 మంది శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది. 130 మందితో గురువారం యూరోప్ కు బయలుదేరిన ఓ రబ్బర్ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో శనివారం గుర్తించారు.