
కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో సమాన వాటా దక్కుతుందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను అమల్లోకి తెచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్ వివరించారు.