
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతునే ఉంది. రాష్ట్రంలో నిన్న రాత్రి వరకు 76,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 7,430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,50, 790 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.