https://oktelugu.com/

AP: కృష్ణా నదిలో చిక్కుకున్న 70 లారీలు

కృష్ణా జిల్లా నందిగామ నియోజవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిలో ఇసుక కోసం వెళ్లిన 70 లారీలు వరదలో చిక్కుకున్నాయి. ఆకస్మాత్తు వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితి లో అక్కడే నిలిచిపోయాయి. ఈ ఘటనతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను […]

Written By: , Updated On : August 14, 2021 / 11:26 AM IST
Follow us on

కృష్ణా జిల్లా నందిగామ నియోజవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిలో ఇసుక కోసం వెళ్లిన 70 లారీలు వరదలో చిక్కుకున్నాయి. ఆకస్మాత్తు వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితి లో అక్కడే నిలిచిపోయాయి. ఈ ఘటనతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఏదో ఒక రకంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.