
తెలంగాణ కెేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ గురుకులాలు, విద్యా సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానిక విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేవం కొనసాగుతున్నది.