
భారత్ లో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,48,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా 4,205 మంది మరణించారు. 24 గంటల్లో 3.55.338 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,40,938కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 1,93,82,642 గా ఉంది. ప్రస్తుతం 37,04,098 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో 2,54,197 మరణించారు.