
దేశంలో భారీగానే వైద్యులు కరోనా బారినపడుతున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 270 మంది వైద్యులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని ఇండియన మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. కరోనాతో మృతి చెందిన వైద్యుల జాబితాలో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ సైతం ఉన్నారు. మహమ్మారి బారిపడి ఆయన సోమవారం రాత్రి కన్నమూశారు. ఇప్పటి వరకు బీహార్ లో అత్యధికంగా 78 మంది మరణించారు. ఉతర్తప్రదేశ్ లో 37 మంది, ఢిల్లీలో 29 మంది మరణించారు. మొదటి వేవ్ లో 748 మంది వైద్యులు వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు.