
ఆక్సిజన్ కొరతతో ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. ఢిల్లీలోని బాట్రా ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం ఆక్సిజన్ అయిపోయింది. ఇలా జరగడం వారంలో ఇది రెండోసారి. అయితే ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో సమారు 80 నిమిషాల పాటు 230 మంది కరోనా రోగులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టకుని ఉన్నారు. ఇందులో ఒక డాక్టర్ తో పాటు పలువురు రోగులు మరణించినట్టు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.