
దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,295 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ బారినపడిన వారిలో 3,57,295 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 4,209 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కొవిడ్ కేసులు 2,60,31,991 కి పెరిగాయి. ఇప్పటి వరకు 2,27,12,735 మంది కోలుకున్నారు. మరో 30,27,925 యాక్టి్ కేసులున్నాయి. 2,91,331 మంది చనిపోయారు.