
కొవిడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 18 మంది మృతిచెందిన విచారక ఘటన గుజరాత్ రాష్ట్రం భరూచ్ లోని పటేల్ వెల్ఫేర్ కొవిడ్ సంరక్షణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ అర్ధరాత్రి తర్వాత కొవిడ్ కేంద్రంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన కేంద్రంలో ఉన్న కొవిడ్ రోగులను స్థానిక అధికారులు ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలోని కింది అంతస్తులో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతోనే కరోనా బాధితులు చనిపోయినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం జరిగిన కొవిడ్ కేంద్రం నిర్వహణ ఓ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.