
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 16,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21,385 మంది చికిత్సకు కోలుకున్నారు. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1,64,3557 కు పెరిగాయి. 1,44,6244 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,86,782 కు చేరాయి. ఇప్పటి వరకు మొత్తం 10531 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 84,224 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది.