
ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వ నిపుణుల కమిటీ అధిపతి డాక్టర్ ఎన్. కె. అరోరా పేర్కొన్నారు. ఆయన ఇటీవల ఓ ఆంగ్ల ఛానల్ తో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. ప్రభుత్వం లక్ష్యాన్ని చేరుకుంటుందన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో వ్యాక్సిన్ పంపిణీని ఎలా పెంచుతారనేదే ఇక్కడ అత్యంత కీలకమైన అంశమన్నారు. ప్రస్తుతానికి టీకాల అందుబాటు క్రమంగా పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. మే వరకు నెలకు 5.6 కోట్ల డోసులు అందుబాటులో ఉండేవాన్నారు. ఇప్పుడు వాటి సంఖ్య నెలకు 10 కోట్ల నుంచి 12 కోట్లకు చేరిందని అరోరా పేర్కొన్నారు.