
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉదార స్వభావం చాటుకున్నది. మహమ్మారి విజృంభణతో ఉపాధి కోల్పోయి అర్ధాకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు జూన్ నెలకు 15 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. జూన్ లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53 లక్షల 56 వేల కార్డు దారులకు అందించే పదిహేను కిలోలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33 లక్షల 86 వేల కార్డు దారులకు ఎలాంటి పరిమితి లేకుండా పదిహేను కిలోలు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.