Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం చర్చలకు సన్నాహాలు జరుగుతున్నప్పటికీ మరోవైపు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఉక్రెయిన్ పై తమ బలగాలు చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఆ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కీవ్ లో డ్రోన్లు, క్షిపణులు సాయుధ పోరాట వాహనాలు, ఫిరంగి తుపాలను ధ్వంసం చేశామన్నారు.