Minor Girl: దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల పాలిట రక్షణ మాత్రం కల్పించడం లేదు. దీంతో రోజుకు ఏదో ఒక చోట మహిళలు మోసపోతూనే ఉన్నారు. ఫలితంగా వారి భవిష్యత్ అంధకారంలో చిక్కుకుంటోంది. నిర్భయ, దిశ లాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వచ్చిన ఆగ్రహాల నేపథ్యంలో జరిగిన పరిణామాలు చూసినా భయం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఆడవారికి రక్షణ మాత్రం కనిపించడం లేదు.\

చత్తీస్ గఢ్ రాష్ర్టంలోని బిలాస్ పూర్ లో 14 ఏళ్ల బాలిక(Minor Girl)పై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో బాలిక చాటింగ్ చేసింది. ఇదే అదనుగా భావించిన అతడు ఒకసారి కలుద్దామని చెప్పడంతో బాలిక నమ్మి వెళ్లింది. అక్కడ అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు. బాలిక అతడి నుంచి తప్పించుకుని ఇంటికెళ్లి జరిగింది చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు చెప్పిన ఆధారాలతో విచారణ చేపడుతున్నారు. ఘటన పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అత్యాచారం చేసిన అనంతరం ఎవరికైనా చెబితే చంపుతానని నిందితుడు బెదిరించినట్లు బాలిక పేర్కొంది.
నిందితుడు తన ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకుని వెళ్లిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచార ఘటనపై అందరు భయాందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: మాజీ ప్రియుడి స్కెచ్.. ప్రియురాలిపై పలుమార్లు స్నేహితులతో అత్యాచారం
14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం పొందే అవకాశం.. ఏం చేయాలంటే?