
కరోనా బాధితులకు సరైన సమయానికి ఆక్సిజన్ అందక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో కనీసం 11 మంది కరోనా రోగులు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. సోమవారం రాత్రి 8.15 నుంచి 8.30 గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య ఏర్పడినట్లు తెలిపారు. దాదాపు 1000 మందికి చికిత్స జరుగుతోందన్నారు.