
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 85,311 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10,413 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 83 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. అత్యధికంగా చిత్తురు జిల్లాలో 14 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 15,649 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,33,773 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.