
దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 1.5 లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 20,75,428 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,32,364 మందికి పాజిటివ్ గా తేలింది. 24 గంటల వ్యవధిలో 2,713 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజు కంటే మరణాల సంఖ్య తక్కువగానే నమోదైంది. మొత్తంగా ఇప్పటి వరకు 2,85,74,350 మందికి కరోనా సోకగా 3,40,702 మంది బలయ్యారు. క్రీయాశీలరేటు 6.02 శాతానికి తగ్గగా రికవరీరేటు 92,79 శాతానికి పెరిగింది.