
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో మన దేశానికి అండగా నిలిచేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. సాధ్యమైనంత వేగంగా భారత్ కు సాయం చేస్తామన బైడెన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్కు అమెరికా హామీ ఇచ్చిన కొవిడ్-19 రిలీఫ్ షిప్మెంట్లో భాగంగా 1.25 లక్షల రెమ్ డెసివిర్ వయల్స్ యూఎస్ నుంచి భారత్ చేరుకున్నాయి. దీని కన్నా ముందు అమెరికా నుంచి ఒక విమానం వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు తదితర మెడికల్ పరికరాలను తీసుకొని భారత్ చేరుకుంది. వీటిలో పాటు ఎన్ 95 మాస్కులు, కీలకమైన మెడికల్ సప్లైలు కూడా భారత్ కు యూఎస్ అందించింది.