
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాల నేపథ్యంలో నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు క్రమంగా లాభాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.28 గంటల సమయంలో సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 52,964 వద్ద.. నిష్టీ 22 పాయింట్లు లాభపడి 15,840 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.65 వద్ద ట్రేడవుతోంది. ఒపెన్ కూటమిలో నెలకొన్న ప్రతిష్టంభనతో ఇంధన ధరలు పెరుగుతున్నాయి.