
రాజధాని రైతుల కౌలు అంశం హైకోర్టులో విచారణకు వచ్చింది. కౌలు చెల్లింపుల కోసం మందడం రైతు యుగంధర్ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం గతంలో మూడు వారాల్లో కౌలు రైతుల డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు ముగిసినా ప్రభుత్వం కౌలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో న్యాయవాది ఇంద్రనీల్ కౌలు విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సోమవారనికి ఈ కేసు విచారణకు హైకోర్టు ఆదేశించింది.