
భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ లో మరోమార్పు చోటుచేసుకుంది. శ్రీలంక బృందంలో ఇద్దరికి కరోనా సోకడంతో అప్రమత్తమైన ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రధాన జట్టు ఆటగాళ్లందరినీ క్వారంటైన్ తరలించింది. ఆటగాళ్లందరూ కా్వరంటైన్ వెళ్లడంతో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన సిరీస్ ను నాలుగు రోజులు వెనక్కి జరిపి 17 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ షెడ్యూల్ బీసీసీఐ మార్పులు చేసింది. 18 నుంచి సిరీస్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం 18న తొలి వన్డే జరగనుండగా 20,23, తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయని పేర్కొన్నారు. 25 నుంచి టీ 20 సిరీస్ మొదలవుతుంది.