
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 కేసులు, 911 మరణాలు వెలుగుచూశాయి. క్రితంరోజుతో పోల్చితే కేసుల్లో 5.4 శాతం తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. అంతకు ముందు రోజు 817 మంది మరణించారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 3.07 కోట్ల మంది కి పైగా కరోనా సోకగా 4,05,939 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17,90,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షల సంఖ్య 42,7 కోట్లకు చేరింది.