
అమరావతిలో దళిత రైతుల నుంచి భూములు లాక్కోవడంలో ప్రమేయమున్న వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అమరావతిలో దళితులెవరూ ఉండకూడదని భావించిన తెదేపా అధినేత చంద్రబాబు తన అనుయాయులు ద్వారా పక్కాగా పథకం పన్ని భూములను లాక్కున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దింపిన చంద్రబాబు అసైన్డ్ భూములు కలిగిన రైతులకు ప్యాకేజీలు రావని మభ్యపెట్టి తక్కువ ధరకు లక్కున్నారన్నారు.