
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ నమ్మారని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. గతంలో సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా ఉందనే విషయం అందిరికీ తెలిసిందే. రాష్ట్రల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి. పక్కరాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం అన్నారు.