
రిషబ్ పంత్ తానొక మ్యాచ్ విజేతనని నిరూపించుకున్నాడని టీమ్ ఇండియా ప్రపంచకప్ ల హీరో యువరాజ్ సింగ్ అన్నాడు. అతడిలో భవిష్యత్తు సారథి కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. గిల్లీ, పంత్ తరహా బ్యాట్స్ మన్ క్షణాల్లో ఆటను మార్చేస్తారని ప్రశంసించాడు. గతంతో పోలిస్తే రిషబ్ పంత్ మరింత పరిణతి సాధించాడని మీరంతా అంటున్నారు. అందుకు సంతోషం. ఎందుకంటే అతడు ఔటైన తీరు చూసి చాలామంది విమర్శించారు. అతడి గురించి సానుకూల మాటలు వినడం బాగుందని అన్నారు.